VIDEO: ఆయిల్ క్యాన్‌లో నీళ్లు.. బాధితుడి ఆగ్రహం
MDCL: బోడుప్పల్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. శరత్ యాదవ్ అనే వ్యక్తి జెప్టో (Zepto)లో 5 లీటర్ల ఫ్రీడమ్ ఆయిల్ క్యాన్ ఆర్డర్ చేయగా, అందులో నూనెకు బదులు నీళ్లు వచ్చాయి. దీనిపై జెప్టో యాజమాన్యం స్పందించకపోవడంతో బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపోయానని గ్రహించిన శరత్, వినియోగదారుల ఫోరమ్‌లో కేసు వేస్తానని పేర్కొన్నారు.