'నిరాశ్రయులకు ఇళ్ళు మంజూరు చేయాలి'
ASR: నిరంతర భారీ వర్షానికి అరకులోయ మండలం, బొండం పంచాయితీలో మూడు మట్టి ఇళ్లు ద్వంసమైనట్లు సర్పంచ్ భాస్కరరావు తెలిపారు. పంచాయితీలోని బొండం వాసి కిల్లో అప్పన్న, మజ్జివలసకు చెందిన కొర్రా కమల, మజ్జి గురుబరిల ఇంటి గోడలు, పెంకులు జారాయి. దీంతో బాధితులకు బొండం పాఠశాలలో, మజ్జివలస అంగన్వాడీలో షెల్టర్ ఇచ్చారు. బాధితులకు ఇళ్ళు మంజూరు చేయాలని సర్పంచ్ కోరారు.