VIDEO: వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం
NGKL: ఊర్కొండ మండల పరిధిలోని ఊర్కొండపేట గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రసిద్ధ శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తి భావం వెల్లివిరిసింది. శుక్రవారం అభిజిత్ లగ్నంలో పండితుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య సీతమ్మ-రామయ్యల కళ్యాణం జరిగింది.