ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎంపికపై సీపీఎం ధర్నా

KMM: ఇందిరమ్మ ఇళ్ళను అర్హత కలిగిన వారికి మాత్రమే ఇవ్వాలని సీపీఎం జిల్లా నాయకుడు రామారావు డిమాండ్ చేశారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇందిరమ్మ కమిటీల పేరుతో లబ్ధిదారుల ఎంపికలు పూర్తిగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అర్హత లేని వారికి ఇల్లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.