తోటపల్లి కాలువను పరిశీలించి MRO
VZM: బొబ్బిలి మండలంలోని చింతాడ, పక్కి, రాముడువలస వద్ద తోటపల్లి కాలువను ఎమ్మార్వో ఎం. శ్రీను పరిశీలించారు. ఎమ్మార్వో మాట్లాడుతూ.. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కాలువకు ఎక్కడ నష్టం జరిగిందో తెలుసుకునేందుకు పరిశీలించినట్లు చెప్పారు. వర్షాలకు ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయనతో రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.