అవుట్‌ఫాల్ కాలువల పునరుద్ధరణకు రూ.27 కోట్లు
AP: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం బయట ఉన్న నాలుగు అవుట్‌ఫాల్ కాలువలను అధికారులు పునరుద్ధరించనున్నారు. అలాగే, వరద నీరు కాలువల్లోకి వెళ్లేలా పనులు చేపట్టనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.27 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.