వనమాల కనపర్తిలో 150 గ్రా. గంజాయి స్వాధీనం
HNK: ఐనవోలు మండలం వనమాల కనపర్తి గ్రామంలో గంజాయి వినియోగం, విక్రయిస్తున్నారని సమాచారం మేరకు ఎస్సై శ్రీనివాస్ నేతృత్వంలో శనివారం దాడి చేశారు. ముగ్గురు యువకులను పట్టుకొని వారి వద్ద నుంచి 150 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.