రైల్వేస్టేషన్ బోర్డుపై ఎప్పుడైనా ఇది చూశారా?

MDCL: ఆకుపచ్చ రంగు బాక్సులో ఉన్న MSL మార్కింగ్ రైల్వే స్టేషన్ బోర్డుపై ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. చర్లపల్లి స్టేషన్ బోర్డుపై కూడా MSL+525.05M అని రాసి ఉంది. దీని అర్థం ఏంటంటే చర్లపల్లి రైల్వే స్టేషన్ సముద్ర మట్టానికి 525.05 మీటర్ల పైన ఉన్నట్లు అని రైల్వే సివిల్ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. అదే విధంగా MSL అనగా MEAN SEA LEVEL అని పేర్కొన్నారు.