రేపు హనుమకొండలో ఓరుగల్లు పోరు గర్జన సభ..
HNK: రేపు హనుమకొండ కేడీసీ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించబోయే బహుజన ఓరుగల్లు పోరుగర్జన సభను విజయవంతం చేయాలని బీఎస్పీ జిల్లా ఇంఛార్జీ శనిగరపు రాజు అన్నారు. పరకాల అమరధామంలో పోరు గర్జన సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఐక్యతను చాటాలని రాజు పిలుపునిచ్చారు. పరకాల పట్టణ అధ్యక్షులు గూడెల్లి శంకర్, తదితరులు ఉన్నారు.