ఒక్కరోజే భారీగా గ్యాస్ బుకింగ్స్
పశ్చిమాసియా యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడుతుందనే అంశం జనాలను భయబ్రాంతులకు గురిచేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో(75.7 లక్షలు) LPG బుకింగ్‌లు నమోదయ్యాయి. అయితే దేశంలో గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్రం భరోసా ఇచ్చింది. ఈనెల 5వ తేదీతో పోలిస్తే ఉత్పత్తిని 30% పెంచామని, పానిక్ బుకింగ్స్ చేయవద్దని కోరింది.