అప్పుల బాధతో రైతు అత్మహత్య
NLG: అప్పుల బాధతో రైతు అత్మహత్య చేసుకున్న ఘటన చిట్యాల (M) చింతకుంట రామయ్య పల్లిలో జరిగింది. సమాచారం మేరకు అదే గ్రామానికి చెందిన రవీందర్ పంట దిగుబడి రాకపోవడం, భార్య అనారోగ్యం కారణంగా అప్పులు పెరిగిపోవడంతో 15 రోజులు క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుని కూతురు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.