చిలమత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం
SS: చిలమత్తూరు మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సత్యసాయి సేవ సమితి ఆధ్వర్యంలో ఆసుపత్రికి వచ్చిన రోగులకు అన్నదానం చేశారు. సేవకు శ్రీ అంజనీ పుత్ర ఇండియన్ గ్యాస్ రామాంజినేయులు సహకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శ్రీ సత్యసాయి బాబా ఆశీసులు ఉంటాయని సేవ సమితి సభ్యులు నరసింహ రెడ్డి తెలిపారు.