తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ
W.G: ఆచంట మండలం అయోధ్యలంక, భీమలాపురం, ఆచంట వేమవరం గ్రామాల్లో సోమవారం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా మొంథా తుఫాన్ బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తరుఫున నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.