పెన్షన్ దారులు ఆందోళన చెందవద్దు: ఎంపీడీవో

KRNL: పెన్షన్ దారులు ఎవరు ఆందోళన చెందవద్దని MPDO పుల్లయ్య తెలిపారు. వెరిఫికేషన్‌లో 40% కంటే తక్కువ వికలాంగత్వం వచ్చిన 165 మంది డిసేబుల్ పెన్షన్ దారులు ఉన్నారని చెప్పారు. అయితే ప్రభుత్వం వారికి పింఛన్ పొందే అవకాశం కల్పించిందని స్పష్టం చేశారు. ఇందుకోసం సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు, వెల్ఫేర్ అసిస్టెంట్ ఇచ్చిన నోటీసు MPDO కార్యాలయంలో సమర్పించాలన్నారు.