నిజాం అరాచకానికి ఎదురైన గిరిజన గర్వం.. కొమురం సూరు
ASF: జల్, జంగల్, జమీన్ నినాదం వినగానే అందరికీ గుర్తొచ్చేది కొమురం భీం. ఆదివాసీ హక్కుల కోసం నిజాంతో పోరాడిన భీంకు అండగా నిలిచిన వ్యక్తే కొమురం సూరు. గెరిల్లా సైన్యం ఏర్పాటులో తోడ్పాటునందించాడు. భీం కోసం సైన్యం గాలిస్తూ సూరుని పట్టుకుని చిత్రహింసలు పెట్టినా ఆచూకీ చెప్పలేదు. ఉద్యమంలో కాళ్లు, చేతులూ పోయినా భీం వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు కృషిచేశాడు.