విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. పశువులు బలి
ప్రకాశం: జిల్లా చీమకుర్తి మండలం పులికొండ గ్రామంలో కరెంట్ షాక్‌తో పశువులు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పశువులను ఇంటికి వచ్చే సమయంలో పొలాలలో ఉన్న త్రీఫేస్ కరెంటు వైర్లు కింద పడి ఉండడంతో పశువులకు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. వెంటనే వారికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.