పుట్‌పాత్ ఆక్రమణలు.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం

పుట్‌పాత్ ఆక్రమణలు.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం

విశాఖపట్నం దక్షిణ వర్గం కలెక్టర్ ఆఫీస్ సమీపంలో కేజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రి ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకోవడంపై స్థానికులు, రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలు మళ్ళీ యథావిధిగా ఏర్పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని, బాధితులు వాపోతున్నారు. ఈ సమస్యపై అధికారులు సిబ్బంది స్పందించాలని, ఫుట్‌పాత్‌లను త్వరగా ఖాళీ చేయించి, ఆక్రమణలను తొలగించాలని ప్రజలు కోరుకుంటున్నారు.