లేడీ డాన్ అరుణకు రిమాండ్

లేడీ డాన్ అరుణకు రిమాండ్

నెల్లూరు లేడీ డాన్ అరుణకు మరో కేసులో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని నగదు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు సూర్యారావుపేట PSలో ఫిర్యాదు చేశారు. దీంతో నెల్లూరు జిల్లా జైలులో ఉన్న ఆమెను విజయవాడ పోలీసులు శుక్రవారం పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.