VIDEO: నీటి కుంటలో పడిన విద్యార్ది మృతదేహం లభ్యం
PLD: నరసరావుపేట మండలం బసికాపురంలో విషాదం చోటుచేసుకుంది. హోలీ పండుగ కోసం ఇంటికి వచ్చిన గోపి అనే విద్యార్థి, స్నేహితులతో కలిసి స్థానిక నీటి కుంటలో ఈతకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయిన గోపి కోసం 8 గంటల పాటు గాలింపు చేపట్టగా, చివరకు మృతదేహం లభ్యమైంది. పండుగ రోజునే విద్యార్థి మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.