కొమ్ముగూడెంలో అగ్నిప్రమాదం

కొమ్ముగూడెంలో అగ్నిప్రమాదం

BDK: ఇల్లందు మండలం రొంపేడు పంచాయతీ కొమ్ముగూడెం అటవీ ప్రాంతంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. వేసవి తీవ్రతకు ఉష్ణోగ్రతలు పెరగడంతో జామాయిల్ తోటలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.