VIDEO: మద్యం మత్తులో వ్యక్తి హల్‌చల్

VIDEO: మద్యం మత్తులో వ్యక్తి  హల్‌చల్

తిరుపతి: తిరుత్తణికి చెందిన ఓ వ్యక్తి తాగిన మత్తులో బండరాళ్లతో ఓ కారును ధ్వంసం చేశాడు. ఆ తర్వాత అంగళ్లు, ఇళ్లపై రాళ్లు విసిరాడు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. మానసిక పరిస్థితి సరిగాలేకపోవడంతో ఈ విధంగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.