అనారోగ్య సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య

మేడ్చల్: పోచారం ఐటీ కారిడార్ పరిధిలో అంబర్పేటకు చెందిన పగడాల నవీన్ కుమార్ (40) ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు. నెల రోజుల క్రితం చౌదరిగూడ మక్తకు వచ్చి ఉంటున్న నవీన్ భార్య, పిల్లలు లేని సమయంలో తన తల్లిదండ్రులను గదిలో ఉంచి, మరో గదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.