KFCలో కుళ్లిన చికెన్.. కస్టమర్ గొడవ

KFCలో కుళ్లిన చికెన్.. కస్టమర్ గొడవ

TG: HYD కూకట్‌పల్లిలోని KFCలో దారుణం వెలుగుచూసింది. స్థానిక అశోక్ వన్‌మాల్‌లోని ఔట్లెట్ ఓ కస్టమర్‌కు కుళ్లిన చికెన్ వడ్డించింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సదరు కస్టమర్.. ఇది తిని ఫుడ్ పాయిజన్ అయితే ఎవరు బాధ్యులని నిలదీశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. బయట ఫుడ్ తినాలంటే భయపడే పరిస్థితి ఉందని నెటిజన్లు అంటున్నారు.