EVM గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్
BHPL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలలో ఉన్న EVM గోదాంను బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాం భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించి లాక్ బుక్‌లో సంతకం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సాధారణ తనిఖీల్లో భాగంగా గోదాంను పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఎలక్షన్ డిప్యూటీ తాహసీల్దార్ అబ్బాస్ పాల్గొన్నారు.