ఒంగోలులో యువతి సూసైడ్.!
ఒంగోలు పరిధిలోని కబాడిపాలెంలో ఆదివారం ఓ యువతి సూసైడ్ చేసుకుంది. నళిని ఆనే యువతి తన గృహంలో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.