జిందాల్ ప్రతినిధులతో TNTUC అధ్యక్షులు భేటీ

VZM: టీఎన్‌టీయూసీ అధ్యక్షులు లెంక శ్రీను జిందాల్ కంపెనీ లిమిటెడ్ యూనిట్ హెడ్ దినేష్ శర్మ, హెచ్ఆర్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కంపెనీ మూతపడడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. యాజమాన్యంతో మాట్లాడి కంపెనీ తెరిచేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఆయన సానుకూలంగా స్పందించి యాజమాన్యం దృష్టిలో పెడతానని హామీ ఇచ్చారు.