గజేంద్ర మోక్షం నేపథ్యంలో దర్శన వేళల్లో మార్పులు
VSP: శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న (కనుమ) గజేంద్ర మోక్షం ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం తెలిపింది. కొండ దిగువ పూలతోట వద్ద ఉత్సవం అనంతరం గ్రామ తిరువీధి జరుగుతుందని పేర్కొంది. భక్తులకు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దర్శనాలు ఉంటాయని ఈవో తెలిపారు.