రేపు మార్కాపురం కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్

రేపు మార్కాపురం కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్

ప్రకాశం: మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తునట్లు జేసీ పీ. శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుందన్నారు. జేసీ మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు అందజేయాలని కోరారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.