VIDEO: రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
KRNL: ఎమ్మిగనూరు మండలం కోటేకల్ క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. దినసరి కూలీ పనులకు వెళ్తున్న కపటికి చెందిన ఆటోను ఓ టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.