డ్రాప్ అవుట్ విద్యార్థులు ఓపెన్ స్కూళ్లలో చదవాలి: కలెక్టర్

WGL: విద్యలో డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులు ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్మీడియట్ పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ చేతుల మీదుగా ఓపెన్ స్కూల్ క్యాలెండర్ పోస్టర్ ఆవిష్కరించారు. నిరక్షరాస్యులు ఉల్లాస్ కార్యక్రమంలో భాగస్వాములై అక్షరాస్యులుగా మారాలని కొరారు.