'బాధితున్ని బెదిరించిన కేసులో ఐదుగురు విలేకరుల అరెస్ట్'

'బాధితున్ని బెదిరించిన కేసులో ఐదుగురు విలేకరుల అరెస్ట్'

ADB: బోథ్ మండలంలోని ధన్నూర్ గ్రామానికి చెందిన బాధితుడు బైరి వెంకటస్వామిని బెదిరించి రూ. 2 లక్షల వసూలు చేసిన ఘటనలో ఐదుగురు విలేకరుల అరెస్ట్ చేసినట్లు CI గురుస్వామి ఆదివారం తెలిపారు. ఈ మేరకు నిందితులు ప్రవీణ్, అజయ్ కుమార్, రాము, సతీష్, దినేష్ రెడ్డిపై కేసు నమోదైందని వెల్లడించారు. బాధితులు మోసపోతే నిర్భయంగా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించాలని కోరారు.