ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి: ఎమ్మెల్యే
SRD: పటాన్చెరులో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానేతగా జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు. ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.