ఎమ్మెల్యే గండ్ర నేటి పర్యటన వివరాలు

BHPL: జిల్లా కేంద్రంలోని పలు మండలాల్లో MLA గండ్ర సత్యనారాయణ రావు శుక్రవారం విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం 9:45కు రేగొండ మండలంలో, 11 గంటలకు చిట్యాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2 గం. భూపాలపల్లి మంజూరునగర్‌లోని MLA క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని క్యాంప్ కార్యవర్గాలు తెలిపాయి.