ఎమ్మెల్యే మద్దిపాటిని అభినందించిన బిషప్
E.G: గోపాలపురం MLA మద్దిపాటి వెంకటరాజు, ఏలూరులోని బిషప్ హౌస్‌లో RCM పీఠం ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావ్ పొలిమేరను గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో క్రిస్టియన్ ప్రజలు, మిషనరీ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను MLA ప్రస్తావించిన తీరును అభినందించి శాలువాతో సత్కరించి ప్రత్యేక ఆశీస్సులు అందించారు.