టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేయండి: అంబటి

GNTR: రాష్ట్రంలో మహిళలు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను పక్కదారి పట్టించడానికి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని, పోలీసులకు ఇదే ధర్మం అయితే తాము కేసులు పెట్టినటువంటి టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూడా అరెస్టు చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ మేరకు శనివారం నాడు పార్టీనాయకులతో కలిసి గుంటూరు జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు.