ఏలూరులో శంబాల మూవీ టీం సందడి
ఏలూరు నగరంలో సోమవారం రాత్రి శంబాల మూవీ టీం సందడి చేసింది. ఈ సందర్భంగా ఏలూరు పడమర వీధి జాతరలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిసెంబర్ 25న చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్ లో భాగంగా ఏలూరు రావడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో హీరో ఆది పాల్గొన్నారు.