FCRA బిల్లుపై కేంద్రం వెనక్కి
వివాదాస్పద FCRA సవరణ బిల్లు-2026పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవడంతో ఈ బిల్లును ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఇది మైనారిటీలు, NGOల హక్కులను దెబ్బతీసే చట్టం అని మండిపడ్డారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.