పెద్దగోపవరంలో పట్టపగలే చోరీ
కడప జిల్లా గోపవరం మండలం పెద్దగోపవరంలో పట్టపగలే చోరీ ఘటన కలకలం రేపింది. ఓ మహిళ ఇంట్లోకి చొరబడిన దుండగులు సుమారు ఆరు తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. సమాచారం అందుకున్న రూరల్ SI సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీపై స్థానికుల్లో భయం నెలకొంది.