తడిచిన మిర్చిని పరిశీలించిన ఎమ్మెల్యే

తడిచిన మిర్చిని పరిశీలించిన ఎమ్మెల్యే

GDWL: అలంపూర్ నియోజకవర్గంలో అకాల వర్షం కురిసి మిర్చి, పొగాకు రైతులు భారీగా నష్టపోయారని, ఆ రైతులకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని BRS ఎమ్మెల్యే విజయుడు డిమాండ్ చేశారు. అకాల వర్షంతో పండించి కల్లాల్లో ఆరబెట్టుకున్న మిర్చి పంట పూర్తిగా తడిసి ముద్దయిందన్నారు. సోమవారం మానవపాడులో తడిచిన మిర్చిని ఎమ్మెల్యే రైతులతో కలిసి పరిశీలించాడు.