ఉంగుటూరులో వైసీపీ నిరసన కార్యక్రమం
ELR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉంగుటూరు మండలం, రావులపర్రులో వైసీపీ రచ్చబండ-కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పాల్గొని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆవశ్యకతను ప్రజలకు వివరించి వారి వద్ద నుంచి సంతకాలు సేకరించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం సరైన నిర్ణయం కాదన్నారు.