డ్రగ్స్ నిర్మూలన పై విద్యార్థులకు అవగాహన సదస్సు
సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్దూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం మాట్లాడుతూ.. విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం (డ్రగ్స్), మత్తు పదార్థాల వనం వల్ల కలిగే అనర్ధాలపై వివరించారు.