VIDEO: 3వ రోజుకు చేరిన RTC కార్మికుల రిలే నిరాహార దీక్షలు
AKP: నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం మూడో రోజుకు చేరుకున్నాయి. నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు తమ డిమాండ్ల సాధన కొరకు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. స్థానిక డిపో అధికారులు తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు దీక్షలు చేస్తామని ఆర్టీసీ కార్మికులు పేర్కొన్నారు.