అక్రమంగా ఇసుక తరలింపు.. మూడు ట్రాక్టర్లు స్వాధీనం

అక్రమంగా ఇసుక తరలింపు.. మూడు ట్రాక్టర్లు స్వాధీనం

NZB: నిజాంసాగర్ మండల కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 3 ట్రాక్టర్ల పై కేసు నమోదు చేసినట్లు నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపారు. అచ్చంపేట, మాగి గ్రామాలకి చెందిన ట్రాక్టర్ల  ద్వారా మంజీరా నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా యదేచ్ఛ‌గా ఇసుక అక్రమ రవాణా చేస్తుండ‌టంతో ఆ ట్రాక్ట‌ర్ల‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.