వసతి గృహాన్ని ప్రారంభించిన మంత్రి
WG: నరసాపురం వై.ఎన్. కళాశాలలో శుక్రవారం రూ.2 కోట్లతో నిర్మించిన నూతన బాలుర వసతి గృహాన్ని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. 75 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కళాశాల నుంచి చిరంజీవి, కృష్ణంరాజు, దాసరి నారాయణరావు వంటి ప్రముఖులు విద్యని అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరుకున్నారని కొనియాడారు.