'కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సేవలు అమోఘం'

'కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సేవలు అమోఘం'

E.G: కొవ్వూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సేవలు అమోఘమని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కొనియాడారు. బ్యాంకు సేవలకు గుర్తింపుగా స్వాతంత్య్ర దినోత్సవ రోజున ఉత్తమ సేవా పురస్కార అవార్డు వచ్చిన సందర్భంగా సోమవారం టీడీపీ కార్యాలయంలో బ్యాంకు చైర్మన్ మద్దిపాటి శివరామకృష్ణ, డైరెక్టర్లను ఎమ్మెల్యే శాలువాలు కప్పి అభినందించారు.