స్వాతంత్య్ర వేడుకల నుంచి వాకౌట్

MNCL: బెల్లంపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ అవమానం జరిగిందని ప్రాతినిధ్య AITUC సంఘం వైస్ ప్రెసిడెంట్ తిరుపతి సభా ప్రాంగణం నుంచి వాకౌట్ చేశారు. తిరుపతి మాట్లాడుతూ.. గుర్తింపు సంఘంగా వేడుకలకు పిలిచి ప్రోటోకాల్ పాటించకుండా అవమానించారని ఆగ్రహించారు. ప్రోటోకాల్ విషయంలో అధికారుల అత్యుత్సాహం పనికిరాదన్నారు.