కోహ్లీ స్కోరు 4/5.. ఎందులో తెలుసా?
IPL 2026లో భాగంగా RCB ఏప్రిల్ 5న CSKతో తలపడనుంది. దీంతో ప్లేయర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే, స్టార్ ప్లేయర్ కోహ్లీ ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్నాడు. విరాట్ ఎదుట ఓ ఐదు ప్రశ్నలను ఉంచగా.. నాలుగింటికి సరైన సమాధానాలు ఇచ్చాడు. ఒక్క దానికి మాత్రం చెప్పలేకపోయాడు. అది కూడా తనకు సంబంధించిన ప్రశ్నే కావడం గమనార్హం. ఆ వీడియోను RCB తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.