VIDEO: కలెక్టరేట్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
కృష్ణా: యనమలకుదురు గ్రామానికి చెందిన కృష్ణవేణి అనే మహిళ మచిలీపట్నం కలెక్టరేట్ ఆవరణలో సోమవారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అత్తింటి వారి వేథింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయం జరగకపోవడంతో ఈ చర్యకు పాల్పడినట్లు ఆమె తెలిపింది. అత్తింటి వారు తనని వేధిస్తున్నారని, తన భర్త దాచిన సొమ్మును ఇప్పించాలని అధికారులను వేడుకుంది.