మళ్లీ ఎన్నికలకు వెళ్దాం: రఘనందన్ రావు

TG: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100సీట్లు గెలుస్తామన్న TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలకు బీజేపీ MP రఘనందన్ రావు కౌంటర్ ఇచ్చారు. 'అప్పటి వరకు ఎందుకు.. శాసనసభను రద్దు చేయండి.. ఇప్పుడే ఎన్నికలకు వెళ్దాం. మేము ఓట్ చోరీ చేస్తే మీరు ఎలా గెలిచారు. అలా చేస్తే ఒవైసీని గెలవనిస్తామా? కొత్త ఓటర్ లిస్టుతో మళ్లీ ఎన్నికలకు వెళ్దాం' అని సవాల్ విసిరారు.