ఆలయ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకు వినతి
JGL: సారంగాపూర్ లోని ఆలయ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ గ్రామ నాయకులు, ప్రజలు ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. శ్రీ సీతారామచంద్ర, శ్రీ వెంకటేశ్వర, శివాలయ సముదాయంలో మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని వినతిపత్రం అందజేశారు. సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.